క్రైమ్/లీగల్

కొద్ది గంటల్లోనే పెళ్లి.. వరుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ (జీడిమెట్ల, దిల్‌సుఖ్‌నగర్), నవంబర్ 10: కొద్ది గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన ఓ వరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం రేకెత్తించింది. అర్ధరాత్రి మూడు గంటలకు పెళ్లి మండపానికి చేరుకున్న వరుడు సందీప్ (24).. తన కుటుంబ సభ్యులతో (చిన్నమ్మలు, అన్నలు, తమ్ముళ్లతో) సుదీర్ఘంగా చర్చించి పడుకుంటానని గదిలోకి వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత డోర్ తలుపులను ఎంతకొట్టినా తీయకపోవడంతో రెండో తాళంతో తలుపులను తెరిచారు.
పోలీసుల వివరాల ప్రకారం... నక్కెర్తి శ్రీనివాస్ చారి ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగి. దిల్‌సుఖ్‌నగర్‌లోని లలితా నగర్‌లో గల ఉమా అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. ఇతని కుమారుడు ఎన్.సందీప్ (24) బీటెక్ చదువుకుని ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. సందీప్ తల్లి గత 16 సంవత్సరాల క్రితం చనిపోయింది. తండ్రి శ్రీనివాస్ మరో పెళ్లి చేసుకున్నాడు. అయినా సందీప్ మాత్రం చిన్నప్పటి నుండి అమ్మమ్మ, తాతయ్యల వద్దే పెరిగాడు. తనను పెంచిన తాతయ్య మూడు నెలల క్రితం చనిపోయాడు. అయితే, తండ్రి ఓ అమ్మాయితో సందీప్‌కు పెళ్లిని నిశ్చయించాడు. అయితే, ఏప్రిల్ మాసంలో తాతయ్య ఉన్న సమయంలోనే సందీప్‌కు ఎంగేజ్‌మెంట్ చేశారు. తాతాయ్య చనిపోయిన తరువాత సందీప్ మంజీరా హైట్స్ ఫేజ్- 2, కొత్తపేట్‌లో ఉంటున్నాడు. తాతయ్య చనిపోవడంతో పెళ్లి చేసుకోవద్దని బంధువులు చెప్పడంతో సందీప్ సందిగ్ధంలో పడిపోయినట్లు తెలుస్తోంది. పెళ్లి విషయంలో బంధువులు సైతం తర్జన భర్జన పడినటుల తెలుస్తోంది. ఇదిలా ఉండగా తల్లి లేకపోవడం, పెంచిన తాతయ్య మరణించడంతో కొంతమేర సందీప్ మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి సుమారు మూడు గంటల సమయంలో సందీప్ బంధువులతో కలిసి దూలపల్లి చౌరస్తా, కొంపల్లిలోని వివాహ వేదిక వద్దకు వచ్చారు. కాసేపు మాట్లాడుకున్న కుటుంబసభ్యులు సందీప్ తాను పడుకుంటానని గదిలోకి వెళ్లిన సందీప్ కాసేపటి తరువాత బంధువులు తలుపులు కొట్టగా ఎంతకీ తలుపులను తీయకపోవడంతో రెండవ తాళంతో తలుపులను తెరిచే సరికి ఫంక్షన్ హాల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్‌బషీరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే సందీప్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సందీప్ పడుకున్న గదిని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుని తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సందీప్ ఆత్మహత్యకు గల బలమైన కారణాలపై దర్యాప్తును చేస్తున్నట్లు పేట్‌బషీరాబాద్ సీఐ మహేశ్ తెలిపారు.

*ఆత్మహత్య చేసుకున్న సందీప్ (ఫైల్ ఫొటో)