క్రైమ్/లీగల్

గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : మహారాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ తమకు సమయం ఇవ్వలేదంటూ శివసేన సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం ఏర్పాటుకు తమకు మద్దతు ఇచ్చే పార్టీల వివరాలు అందజేయడానికి మూడు రోజుల గడువుకోరితే గవర్నర్ నిరాకరించారని సేన ఆరోపించింది. గవర్నర్ తీరును సవాల్ చేస్తూ శివసేన మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిందిగా సుప్రీం రిజిస్ట్రీని కోరినట్టు సేన తరఫున్యాయవాది వెల్లడించారు. గవర్నర్ నిర్ణయాన్ని తోసిపుచ్చుతూ ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను కోరింది. అలాగే శాసన సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు తమకు గడువుఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని శివసేన విజ్ఞప్తి చేసింది. మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమని పార్టీ ధ్వజమెత్తింది. ‘గవర్నర్ నిర్ణయం వివక్షాపూరితం. అసంబద్ధం. ఓ పార్టీకి ప్రయోజనం చేకూర్చేది’అంటూ పిటిషన్‌లో ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ మద్దతు సంపాదించేందుకు మూడు రోజుల గడువుఅడిగితే తిరస్కరించడం అన్యాయమని పిటిషన్‌లో పేర్కొన్నారు. శివసేన తరఫున న్యాయవాది సునిల్ ఫెర్నాండెజ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. గవర్నర్ నిర్ణయం ఆర్టిల్ 14, 21కు ఉల్లంఘించడమేనని, ఎలాంటి కారణం చూపకుండా ఏకపక్షం గా నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకు అందజేసిన పిటిషన్‌లో స్పష్టం చేశారు. కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ)ని ప్రతివాదులుగా పేర్కొంది. రాష్టప్రతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడం, కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో బుధవారం మరో పిటిషన్ దాఖలు చేయాలని శివసేన నిర్ణయించింది.