క్రైమ్/లీగల్

లోయలో పడ్డ బస్సు: 16 మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ, నవంబర్ 12: జమ్మూ-కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ప్రమాదవశాత్తున ఓ ప్యాసింజర్ వాహనం లోయలో పడడంతో 16 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నట్లు దోడా సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ముంతాజ్ అహ్మద్ తెలిపారు. మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడిన తీవ్రంగా గాయపడ్డాడని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.25 ప్రాంతంలో ఓ ప్యాసింజర్ వాహనం ఈ జిల్లాలోని మర్మత్ సమీపంలో 700 మీటర్ల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయిందని సూపరింటెండెంట్ ముంతాజ్ తెలిపారు. మలుపు ఉండడం వల్ల డ్రైవర్ వాహనాన్ని కంట్రోలు చేయలేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నామని ఆయన చెప్పారు. ఎతె్తైన ప్రాంతం నుంచి పడడంతో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారని, మరో నలుగురిని ఆసుపత్రికి తీసుకెళుతుండగా మరణించారని ఆయన చెప్పారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కాశ్మీర్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంతో జమ్మూ-కాశ్మీర్‌లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.