క్రైమ్/లీగల్

ఇద్దరు మాజీ మావోల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్(వనస్థలిపురం), నవంబర్ 12: మాజీ మావోయిస్టూ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన భార్యను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, తిరుమలాపురం గ్రామానికి చెందిన నార్ల రవి శర్మ (54) ఆయన భార్య అనురాధ (56) మావోయిస్టు పార్టీలో కీలక స్థానాల్లో పనిచేశారు. రెండేళ్ల క్రితం అరెస్ట్ అయి, జైలుకు వెళ్ళారు. ఇద్దరూ బెయిల్ పై విడుదలై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశాలాంధ్రానగర్ కాలనీలో తల్లి దండ్రులతో కలసి నివాసం ఉంటున్నారు. అయనా మావోయిస్టు పార్టీ, విప్లవాత్మక కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం తెల్లవారుఝామున 3 సోదాలు నిర్వహించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు ఎల్బీనగర్ ఏసీపీ పృధ్విధర్ రావు, ఇన్‌స్పెక్టర్ అశోక్ రెడి నేతృత్వంలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు సోదాలు నిర్వహించారు. నక్సల్స్ సాహిత్యం, పుస్తకాలు, సీడీలు, ల్యాప్ ట్యాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ దంపతులను అరెస్టు చేసి, సాహిత్యానిన స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 1984-86 సంవత్సరంలో హైదరాబాద్‌లోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యూయేట్ చదివిన నార్ల రవి శర్మ పీపుల్స్‌వార్ పార్టీ విధాలనాల పట్ల ఆకర్షితుడై అందులో చేరారు. పార్టీలో అంచెలంచలుగా ఎదిగి హైదారాబాద్ సీటీ ఆర్‌ఎస్‌యూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు. అనేక సార్లు అరెస్టయ జైలుకు వెళ్లారు. బెయల్‌పై వచ్చినా మళ్లీ మామూలే. మావోయిస్టూ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేసిన శర్మపై 16 కేసులున్నాయ.
*చిత్రం...ఎల్బీనగర్ పోలీసుల అదుపులో మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు నార్ల రవి శర్మ, అతని భార్య అనురాధ