క్రైమ్/లీగల్

కసాయి తండ్రికి కటకటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, నవంబర్ 12: ఏ ఆడపిల్లకైనా తండ్రి అంటే ఒక హీరో.. ఒక రక్షణ.. ఒక నమ్మకం. అయితే ఇద్దరు చిన్నారుల పాలిట మాత్రం కన్న తండ్రే కసాయిగా మారాడు. ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉన్న భార్య డబ్బు పంపడం లేదనే అక్కసుతో ఇద్దరు కుమార్తెలతో రాక్షసంగా ప్రవర్తించాడు. కన్న బిడ్డలనే మమకారం కాదు కనీసం చిన్న పిల్లలనే కారుణ్యం కూడా లేకుండా చిత్రహింసలు పెడుతూ నరకం చూపించాడు. ఆడ పిల్లలనే ఇంగిత జ్ఞానం లేకుండా నగ్నంగా నేలపై కూర్చోపెట్టి బెల్ట్, సెల్‌ఫోన్ చార్జింగ్ వైర్‌తో చితకబాదాడు. అంతేకాక ఈ మొత్తం వ్యవహారాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి భార్యకు పంపాడు. డబ్బు పంపకపోతే పిలల్ని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు కసాయి తండ్రిని, అతడికి వంతపాడిన అతడి సోదరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలావున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మద్యసారవ గ్రామానికి చెందిన ఉల్లంపల్లి ఏలీషా, మహాలక్ష్మి దంపతులకు 6, 8 ఏళ్ల వయసున్న కుమార్తెలున్నారు. మహాలక్ష్మి ఉపాధి కోసం ఏడాది క్రితం కువైట్ దేశానికి వెళ్లింది. దీనితో ఇద్దరు ఆడ పిల్లల బాధ్యత భర్త ఎలీషాపై పడింది. కువైట్ నుండి కొద్ది నెలల పాటు ఆమె భర్త ఎలీషాకు డబ్బు పంపించేది. అయితే భర్త ఏ పనీ చేయకుండా తాను పంపుతున్న డబ్బుతో జల్సా చేస్తున్నాడని బంధువుల ద్వారా తెలుసుకున్న మహాలక్ష్మి డబ్బులు పంపడం ఆపేసింది. దీంతో కోపోద్రిక్తుడైన ఎలీషా తరచూ డబ్బులు పంపాలని వేధించేవాడు. అయినప్పటికీ ఆమె డబ్బు పంపకపోవడంతో ఎలీషా రాక్షసుడిగా మారాడు. కన్న కుమార్తెలను నగ్నంగా నేలపై కూర్చోపెట్టి సెల్‌ఫోన్ ఛార్జింగ్ వైరు, బెల్టులతో చితకబాదాడు. దెబ్బలకు తాళలేని చిన్నారుల హాహాకారాలు చేసేవారు. ఎలీషా క్రూరచర్యలకు అతని సోదరి వంతపాడేది. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఎలీషా కువైట్‌లోని భార్యకు పంపాడు. డబ్బు పంపకపోతే పిల్లల్ని చంపేస్తానని బెదిరించాడు. ఈ వీడియోలను చూసి చలించిపోయిన మహాలక్ష్మి తన బంధువులకు వాటిని పంపించింది. ఎలాగైనా తన పిల్లల్ని కాపాడాలని వేడుకుంది. చిన్నారులను చిత్ర హింసలకు గురిచేస్తున్న వీడియోలు మంగళవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనితో రంగంలోకి దిగిన నరసాపురం డీఎస్పీ కె నాగేశ్వరరావు ఉల్లంపర్తి ఎలీషా, అతని సోదరిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. చిన్నారుల సంరక్షణ బాధ్యతలు ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. కాగా ఈ అమానుష ఘటన సమాచారం అందుకున్న రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మంగళవారం నరసాపురం వెళ్లి బాధిత బాలికలను పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కువైట్‌లో ఉన్న బాలికల తల్లితో ఫోన్‌లో మాట్లాడారు. ఆమె తిరిగి వచ్చేవరకూ పిల్లలను ప్రభుత్వం సంరక్షిస్తుందని భరోసానిచ్చారు. చిన్నారులను తణుకులోని బాలసదన్‌లో సంరక్షిస్తామని ప్రకటించారు.

*చిత్రం... గల్ఫ్‌లో ఉన్న చిన్నారుల తల్లితో ఫోన్‌లో మాట్లాడుతున్న మంత్రి వనిత