క్రైమ్/లీగల్

అయోధ్య తీర్పుపై అభ్యంతకర వ్యాఖ్యలు: ఒకరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, నవంబర్ 13: అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పు పడుతూ ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిని పీతంపూర్‌లోని ఒక టైర్ల కంపెనీలో పనిచేసే జితేంద్ర చౌహాన్‌గా గుర్తించారు. 35 ఏళ్ల చౌహాన్ తన ఎఫ్‌పీ ఖాతా నుంచి అయోధ్య కేసుపై వివాదాస్పద పోస్టులు చేశాడు. న్యాయానికి విరుద్ధంగా తీర్పు ఉందని ఆయన తన పోస్టులో విమర్శించాడు. ఈ పోస్టు మత ఘర్షణలకు దారితీసే విధంగా ఉందని ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసి, అతనిని అరెస్టు చేసినట్టు కనాడియా పోలీస్ స్టేషన్ అడిషనల్ సూపరింటెండెంట్ శైలేంద్ర సింగ్ తెలిపారు.