క్రైమ్/లీగల్

ఆర్‌టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 13: భారత సర్వోన్నత న్యాయస్థానం బుధవారం మరో కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి వస్తుందని న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. కోర్టును ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి తీసుకొస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం కోర్టు సెక్రెటరీ జనరల్ ఈ పిటిషన్లు వేశారు. పారదర్శకత అన్నది న్యాయస్వేచ్ఛకు భంగకరం కాదని కోర్టు ప్రకటించింది. గోప్యత హక్కు, సమాచార హక్కు పరస్పరం సహకరించుకుంటూ కలిసిమెలిసి ఉండాలని స్పష్టం చేసింది. ధర్మాసనంలోని మెజారిటీ న్యాయమూర్తులు హైకోర్టు తీర్పునే సమర్ధించడం గమనార్హం. ఆర్‌టీఐను నిఘా దృష్టితో వినియోగించకూడదని, దాన్ని న్యాయవ్యవస్థ స్వేచ్ఛలో వాడాలని కోర్టు పేర్కొంది. గోప్యత, పారదర్శకత న్యాయవ్యవస్థ స్వేచ్ఛ గోసం వినియోగించాలని న్యాయమూర్తులు ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్, దీపక్ గుప్తా, సంజీవ్‌కన్నాతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం చేసిన సిఫార్సుల్లోని పేర్లను బహిర్గతం చేయవచ్చన బెంచ్ కారణాలు కాదని పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీవ్ కన్నా ఒక అభిప్రాయం వ్యక్తం చేయగా, న్యాయమూర్తులు ఎన్వీ రమణ, చంద్రచూడ్ దానికి భిన్నమైన తీర్పునుఇచ్చారు. లిఖిత పూర్వకంగా వేర్వేరు తీర్పులు ఇచ్చారు. గోప్యత. పారదర్శకత మధ్య సమతౌల్యత ఉండేలా చూడాలని దానికి అనుగుణంగానే సీజేఐ కార్యాయలం సమాచారం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. ఆర్‌టీఐ చట్టాన్ని అస్త్రంగా చూడకూడదని, న్యాయవ్యవస్థ స్వతంత్రనను దృష్టిలో పెట్టుకుని వినియోగించుకోవాలని వ్యాఖ్యానించింది. ఢిల్లీ హైకోర్టు 2010 జనవరి 10న
ఆర్‌టీఐ చట్టానికి సంబంధించి ఓ తీర్పును ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి వస్తుందని సంచలనతీర్పు వెలువరించింది. న్యాయ స్వేచ్ఛ అన్నది జడ్జిల ప్రత్యేక అధికారం కాదని కోర్టు విస్పష్టంగా ప్రకటించింది. 88 పేజీల తీర్పును అప్పటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ వ్యతిరేకించారు. న్యాయమూర్తులకు సంబంధించిన సమాచారం ఆర్‌టీఐ చట్టం పరిధిలోకి రాదని అన్నారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏపీ షా నేతృత్వంలో జడ్జిలు విక్రమ్‌జిత్ సేన్, ఎస్ మురళీధర్‌తో కూడిన త్రిసభ్య బెంచ్ ఈ తీర్పును ఇచ్చింది. సీజేఐను ఆర్‌టీఐ చట్టంలోకి తీసుకొస్తే న్యాయ స్వేచ్ఛకు ఆటంకం ఏర్పడుతుందన్న వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆనాడు తీర్పు నిచ్చిన షా తరువాత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన పదవీ విరమణ చేశారు. జస్టిస్ మురళీధర్ ఢిల్లీ హైకోర్టులో సిట్టింగ్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆర్‌టీఐ కార్యకర్త ఎస్‌సీ అగర్వాల్ సీజేఐను ఆర్‌టీఐ పరిధిలోకి తేవాలని పిటిషన్ దాఖు చేశారు. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దానిపై సుప్రీం కోర్టులో వాదించారు.