క్రైమ్/లీగల్

ప.గో.లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరవలి : పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లివద్ద 16వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. రోడ్డు దాటుతున్న మోపెడ్‌ను తప్పించే ప్రయత్నంలో బస్సు అదుపుతప్పి, డివైడర్‌పైకి ఎక్కి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మోపెడ్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు తీవ్రంగా, 29మంది స్వల్పంగా గాయపడ్డారు.
బస్సు బోల్తాపడిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని, అద్దాలు పగులగొట్టి, ప్రయాణీకులను వెలికితీయడంతో ప్రాణనష్టం సంభవించలేదు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు ఖండవల్లి సెంటర్ వద్ద రోడ్డు దాటుతున్న మోపెడ్‌ను తప్పించే ప్రయత్నంలో రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పైకి ఎక్కి, బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మోపెడ్ నడుపుతున్న ఖండవల్లి గ్రామానికి చెందిన కేతా సత్యనారాయణ (60) అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే బస్సు అద్దాలు పగులగొట్టి, ప్రయాణీకులను వెలికితీశారు. ఇద్దరు ప్రయాణీకులు మాత్రం బస్సు సీట్లకింద చిక్కుకుపోయారు. దీనితో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్రేన్ సహకారంతో బోల్తాపడివున్న బస్సును నిలబెట్టి, సీట్ల కింద చిక్కుకున్న ఇద్దరు ప్రయాణీకులను సైతం వెలికితీశారు. గాయపడిన వారందరినీ తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35మంది ఉన్నారు. బస్ డైవర్లు చిక్కిం వెంకటస్వామి, పిల్లల మర్రి మురళీ, ప్రయాణీకులు పేరూరి వెంకట సోమశేఖర్, ఎండి లోసుద్దిన్, కెసిహెచ్ వేంకటేశ్వరరావు, మంచికంటి హిమబిందు తీవ్రంగా గాయపడ్డారు. కాలు నుజ్జునుజ్జయిన హిమబిందును మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తణుకు సీఐ చైతన్య కృష్ణ సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. నిడదవోలు ఎమ్మేల్యే జి శ్రీనివాసనాయుడు సంఘటణా స్ధలానికి చేరుకొని, క్షతగాత్రులను పరామర్శించి వివరాలు తెలుసుకొన్నారు. పెరవలి ఎస్సై కిరణ్ కూమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.