క్రైమ్/లీగల్

విజిలెన్స్ అధికారుల వలలో టీటీడీ ఉద్యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 13: విదేశాల నుంచి వచ్చే ప్రవాస భారతీయులకు టీటీడీ కల్పించే సులభ దర్శన మార్గంలో టీటీడీకి చెందిన ఓ ఉద్యోగి అక్రమ మార్గంలో ముగ్గురు భక్తులను పంపిచే ప్రయత్నం చేసిన సమాచారం ఆలస్యంగా వెలుగు చూసింది. వాస్తవానికి మూడు రోజుల ముందు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు ఆ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఓ ఉన్నతాధికారి కూడా అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే ఆ అధికారి ఎవరన్న విషయంలో విజిలెన్స్ అధికారులు గోప్యతను ప్రదర్శిస్తున్నారు. ఇదిలావుండగా పట్టుబడ్డ ఈ ఇద్దరు ఉద్యోగులు గతంలోను ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.