క్రైమ్/లీగల్

ఇక జాగ్రత్త..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 14: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన తన వ్యాఖ్యలను న్యాయస్థానానికి ముడిపెట్టిన కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు మందలించింది. అయితే, రాహుల్‌కు ఇకమీదట జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ.. ఈ కోర్టు ధిక్కార విచారణను ముగించింది. ప్రధాని నరేంద్ర మోదీపై తాను చేసిన విమర్శలకు సుప్రీం కోర్టు ఆమోదం ఉన్న రీతిలో రాహుల్ గాంధీ పదే పదే ప్రకటనలు ఇవ్వడం దురదృష్టకరం అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రాహుల్ చేసిన విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని.. రాజకీయ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. చౌకీదార్ చోర్‌హై అంటూ రాహుల్ చేసిన ప్రకటనను సవాలు చేస్తూ బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను
సుప్రీం కోర్టు విచారించి తుదితీర్పును వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ న్యాయమూర్తులు ఎస్‌కే కౌల్, కేఎం జోసఫ్‌లతో కూడిన ధర్మాసనం ‘రాహుల్ తన తప్పిదాన్ని అంగీకరించి క్షమాపణ చెప్పి ఉంటే సరిపోయేది.. కానీ 20 పేజీల అఫిడవిట్ దాఖలు చేసి ఈ వ్యవహారాన్ని ఆయన సంక్లిష్టంగా మార్చేశారు’ అని వ్యాఖ్యానించింది. అయితే, అదనపుఅఫిడవిట్‌ను దాఖలు చేసిన రాహుల్.. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకమైనవి కాదని పేర్కొనడంతో పాటు బేషరతుగా క్షమాపణ చెప్పడాన్ని పరిగణనలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు.. ఈ ధిక్కార కేసును ముగించింది. రాఫెల్ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఏముందో కూడా తెలుసుకోకుండా రాహుల్ గాంధీ.. ప్రకటనలు చేయడం దురదృష్టకరమని, ప్రధాన మంత్రిపై తాను చేసిన విమర్శలను కోర్టు ఉత్తర్వు పరోక్షంగా సమర్థించింది అన్నట్లుగా రాహుల్ మాట్లాడారని న్యాయమూర్తులు తెలిపారు. ఈ తీర్పును న్యాయమూర్తి కౌల్ రాశారు. రాహుల్ గాంధీ ఏదో ఒక సందర్భంలో కాకుండా పదేపదే ఈ తరహా ప్రకటనలు చేస్తూ వెళ్లారని.. ప్రతి దాంట్లోనూ పరోక్షంగా సుప్రీంకోర్టు ప్రమేయాన్ని ఉద్దేశించి మాట్లాడారని తీర్పు రాసిన కౌల్ తెలిపారు. రాహుల్‌గాంధీ ఆ విధంగా మాట్లాడాల్సింది కాదని కోర్టు ఉత్తర్వును క్షుణ్ణంగా పరిశీలించి తనను తాను సవరించుకొని ఉండాల్సిందని బెంచ్ తెలిపింది. ప్రధాన తీర్పుతో ఏకీభవిస్తూ విడిగా తన తీర్పును వెలువరించిన జస్టిస్ జోసఫ్.. రాఫెల్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్‌లను కొట్టివేశారు. జస్టిస్ కౌల్ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. కాగా, బేషరతు క్షమాపణ చెబుతూ మే 5న రాహుల్ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను ప్రస్తావించిన సుప్రీం బెంచ్.. ‘మొత్తానికి జ్ఞానోదయం అయింది’ అని తెలిపింది. ఎన్నికల్లో ఎలా ప్రచారం చేసుకోవాలన్నది ఆయా పార్టీలకు సంబంధించిన అంశమని కానీ.. కోర్టులను అనవసరంగా వివాదాల్లో లాగకూడదని బెంచ్ తెలిపింది. అయితే, రాహుల్ గాంధీ భవిష్యత్తులో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హితవు పలికింది. రాహుల్ తన తప్పిదాన్ని తెలుసుకొన్నారు కాబట్టి భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలన్న ఓ హెచ్చరికతో ఈ ధిక్కార పిటిషన్ కేసును ముగిస్తున్నట్లు తెలిపింది.

*అక్టోబర్ 10న సూరత్‌లో రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)