క్రైమ్/లీగల్

మళ్లీ మోదీకి క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ సంస్థ దసార్ట్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి నరేంద్ర మోదీ సర్కార్‌కు సుప్రీం కోర్టు రెండోసారి కూడా క్లీన్‌చిట్ ఇచ్చింది. ఈ కొనుగోలు వ్యవహారంలో కమిషన్లు చేతులు మారాయని, వీటిని నిగ్గు దేల్చేందుకు ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలంటూ సిబిఐ చేసిన అప్పీలును తిరస్కరించింది. అలాగే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన విధాన నిర్ణాయక ప్రక్రియను సందేహించాల్సిన అవసరం లేదంటూ గత ఏడాది డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును సమీక్షించాలన్న పిటిషన్లను కూడా సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 58వేల కోట్ల రూపాయల విలువైన ఈ ఒప్పందంలో వివాదాస్పద అంశాలపై ఎలాంటి విచారణ లేకుండానే సంతృప్తిని వ్యక్తం చేశారంటూ వచ్చిన వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. ఈ వ్యవహారంపై రివ్యూ పిటిషన్లను తిరస్కరించడం ద్వారా రెండోసారి కూడా మోదీ సర్కార్‌కు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ సారథ్యంలోని సుప్రీం బెంచి క్లీన్‌చిట్ ఇచ్చినట్టయింది. గతంలోనే అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినందున ఎఫ్‌ఐఆర్ దాఖలుకు ఎలాంటి ఆదేశాలను జారీ చేయడం లేదని తెలిపింది. ఈ వ్యవహారంలో తప్పిదం ఉంటే తప్ప రివ్యూ పిటిషన్లను పరిగణనలోకి తీసుకోజాలమని ధర్మాసనం పేర్కొంది. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారం ఏళ్ల తరబడి అనేక ప్రభుత్వాల ముందు పెండింగ్‌లో ఉంటూ వచ్చిందని, వీటి అవసరం ఇప్పటికీ ఉందన్న అంశాన్ని విస్మరించకూడదని స్పష్టం చేసింది. రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హ, అరుణ్ శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌లు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విమానాల ధరలకు సంబంధించి అక్రమాలు జరిగాయన్న అంశాన్ని పేర్కొన్న న్యాయస్థానం తమ పరిశీలనకు నివేదించిన అంశాలతో సంతృప్తి చెందినట్టు తెలిపింది. అయితే ధరలను నిర్ణయించడం కోర్టు బాధ్యత కాదని, కేవలం కొందరు వ్యక్తుల అనుమానాల కారణంగా చర్యలు తీసుకోలేమని తేల్చిచెప్పింది. కీలక పత్రాల పరిశీలనాంశాన్ని పేర్కొన్న ధర్మాసనం ‘యాపిల్స్, కమలాపళ్లను సరిపోల్చలేము’అని వ్యాఖ్యానించింది. వీటి కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాన్ని అన్ని అంశాలను కూలంకషంగా చర్చింది, నిపుణులు సంప్రదించిన తర్వాతే తీసుకుని ఉంటారని, అంతిమ నిర్ణయాన్ని సంబంధిత అధారిటీయే తీసుకుంటుందని కోర్టు తెలిపింది.