క్రైమ్/లీగల్

డిపాజిట్లు పేరుతో మోసం కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు, జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 14: డిపాజిట్‌ల పేరుతో నగదు కట్టించుకు ని మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులపై నేరం రుజువుకావడంతో ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.30వేలు జరిమానా విధిస్తూ ఎనిమిదో ఫాస్ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. పటమటకు చెందిన మరీదు నాగేంద్రరావు అనే వ్యక్తి పత్రికల్లో వచ్చిన ప్రకటన చూసి గవర్నర్‌పేట బకింగ్ హామ్ పోస్టు ఆఫీసు వద్ద ఉరన్న ఎయిమ్ ఇండియా ప్రైవేటు కంపెనీ మేనేజర్ రాబర్ట్‌ను సంప్రదించాడు. తమ కంపెనీలో రూ.85వేలు క డితే ప్రతి నెలా మూడేళ్ల పాటు నెలకు రూ.6,055లు ఇస్తామని చెప్పడంతో 2009 జూలైలో రెండు విడతలుగా రూ.లక్షా70వేలు చెల్లించాడు. తర్వాత నెలలో రూ.12,110లు చెక్కు రూపం లో ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత చూ డగా కంపెనీ బోర్డు తిప్పేసినట్లు తెలుసుకుని మోసపోయినట్లు గ్రహించి మరికొందరు బాధితులతో కలిసి గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయ గా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులైన ముంబయికి చెందిన ప్ర మోద్ గంగారామ్ రౌత్ (49), పెజ్జొనిపేటకు చెందిన ఆంధోని రాబర్ట్ (35)ల ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ప్రాసిక్యూషన్ తరుఫున పోలీసులు ప్రవేశపెట్టిన 11మంది సాక్షులను విచారించగా నిందితులపై నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.