క్రైమ్/లీగల్

చిన్మయానందకు బెయిల్ మంజూరుపై తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలహాబాద్: లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేత స్వామి చిన్మయానంద దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. న్యాయ విద్యార్థిని చిన్మయానందపై లైంగిక వేధింపుల కేసు పెట్టింది. శనివారం చిన్మయానంద బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న న్యాయమూర్తి రాహుల్ చతుర్వేది తీర్పును రిజర్వ్‌లో ఉంచారు. కేంద్ర మాజీ మంత్రి చిన్మయానందను సెప్టెంబర్ 21న అరెస్టు చేశారు. ఆయనపై 364 (కిడ్నాప్, హత్య), 506(నేరం,్భయపెట్టడం)కింద అభియోగాలున నమోదయ్యాయి. డబ్బుల కోసమే తనను బెదిరించి తప్పుడు కేసులు పెట్టిందని బీజేపీ నేత ఫిర్యాదు చేశాడు. దీంతో బాధిత విద్యార్థినిని అరెస్టు చేశారు. ఆమె బెయిల్ పిటిషన్ ఈనెల 27న మరోబెంచ్ విచారించనుంది.