క్రైమ్/లీగల్

అపరాల అక్రమ నిల్వలపై విజిలెన్స్ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 16: గుంటూరు జిల్లాలో అపరాలు అక్రమంగా నిల్వచేయడం ద్వారా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న అక్రమార్కులపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝుళిపించారు. శనివారం గుంటూరు జిల్లావ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించి కందులు, సజ్జలు, రాగులు అక్రమంగా నిల్వచేసిన గోడౌన్‌లు, షాపుల్లో తనిఖీలు నిర్వహించి, బాధ్యులపై కేసు నమోదు చేసి, షాపులను సీజ్ చేశారు. విజిలెన్స్ ఎస్‌పీ పీ జాషువా ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ గత కొంతకాలంగా జిల్లాలో పలుచోట్ల కొంతమంది వ్యాపారులు అపరాల కృత్రిమ కొరత సృష్టించే విధంగా నిల్వ ఉంచి బహిరంగ మార్కెట్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారన్న సమాచారం అందిందన్నారు. దీంతో శనివారం గుంటూరు నగరంలోని ఏటుకూరు రోడ్డు, సంగడిగుంట ప్రాంతాల్లోని ఐదు గోడౌన్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో రాగులు 1440 క్వింటాళ్లు, జొన్నలు 153 క్వింటాళ్లు (1747 బస్తాలు) అక్రమ నిల్వలను గుర్తించామన్నారు.
వీటి విలువ సుమారు బహిరంగ మార్కెట్‌లో 53 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన కార్తీకేయ దాల్ ప్రొడ్యూసర్స్ షాపు, అదేవిధంగా శ్రీ సూర్యకుమారి ఏజన్సీస్ నిర్వాహకులపై కేసులు నమోదు చేశామని తెలిపారు.