క్రైమ్/లీగల్

బెయిలుపై విడుదలైన చింతమనేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 16: పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శనివారం ఏలూరు జిల్లా జైలు నుండి విడుదలయ్యారు. పలు కేసులోల నిందితుడిగా ఉన్న చంతమనేని గత 66 రోజులుగా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొన్ని కేసులకు సంబంధించి శుక్రవారం న్యాయస్థానం చింతమనేనికి బెయిలు మంజూరు చేసింది. దీంతో శనివారం ఉదయం అన్ని లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం చింతమనేని జైలు నుండి బయటకు వచ్చారు. 66 రోజుల సుదీర్ఘకాలం జైలులో ఉండి విడుదలకానుండటంతో పెద్ద సంఖ్యలో చింతమనేని అభిమానులు జైలు వద్దకు తరలివచ్చారు. జైలు నుండి విడుదలైన అనంతరం సమీపంలోని దర్గాకు వెళ్లిన చింతమనేని ప్రార్థనలు చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను త్రికరణ శుద్ధిగా పాటించిన తనను భూస్థాపితం చేయడానికి పలు అక్రమ కేసులు బనాయించారని ఈ సందర్భంగా చింతమనేని వ్యాఖ్యానించారు. ప్రజా సంఘాలు తాను రాజకీయాలకు పనికిరానని నిర్ణయిస్తే శాశ్వతంగా రాజకీయాలనుండి తప్పుకుంటానన్నారు. తనపై అక్రమ కేసులు నమోదైన సమయంలో అండగా నిలిచిన పార్టీ పెద్దలు, అభిమానులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కక్ష సాధింపులో భాగంగానే కేసులు
గుంటూరు: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు ధోరణితోనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అనేక కేసులు పెడుతున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. శనివారం మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడుతూ కావాలనే మీపై 11 కేసులు పెట్టారని ఇందులో 9 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. వైసీపీ అక్రమ కేసులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోవాలని, తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు.

*చిత్రం... బెయిలుపై విడుదలై బయటకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని.