క్రైమ్/లీగల్

జంపన్నవాగులో గల్లంతైన మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, నవంబర్ 18: మేడారం జంపన్నవాగులో గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు సోమవారం మధ్యాహ్నం లభ్యమయ్యాయి. స్థానిక ఎస్సై రవిందర్, మేడారం గ్రామస్థుల ఆధ్వర్యంలో సుమారు 12 గంటల పాటు గాలింపులు చేపట్టి ఎట్టకేలకు ఇద్దరి మృతదేహాలను కనుగొన్నారు. ఆదివారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓడెం ప్రశాంత్ (24), ముక్కునూటి రఘు (23)లు జంపన్నవాగులోకి స్నానం చేసేందుకు వెళ్లి నీట మునిగిన విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి వరకు మృతదేహాల కోసం గాలింపులు చేపట్టిన పోలీసులు, స్థానికులు తిరిగి సోమవారం గాలింపులు ముమ్మరం చేయగా జంపన్నవాగులో ఇద్దరు మృతదేహాలు లభ్యం కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకులిద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు వచ్చి అకాల మృతి చెందిన ప్రశాంత్, రఘుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది.
*చిత్రం... మృతదేహాలను బయటకు తీసుకొస్తున్న గజ ఈతగాళ్లు