క్రైమ్/లీగల్

రైల్లోంచి దూకి ఇద్దరు యువకుల ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, నవంబర్ 18: చిత్తూరు జిల్లా పీలేరు వద్ద రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరు యువకులు విగత జీవులుగా పడి ఉన్నారు. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి మార్గంలో సోమవారం ఉదయం ఇద్దరు యువకులు గుర్తుతెలియని రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తన్నారు. కదిరి రైల్వే పోలీసులు మహబూబ్‌భాష, సాల్మాన్‌రాజ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం ప్రాంతంలో పట్టణ పరిధిలోని ఎర్రగుంట్లపల్లి రైల్వే ట్రాక్ సమీపంలో ఇద్దరు యువకులు రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకొని విగత జీవుల్లా పడి ఉన్నారు. స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు ఫిర్యాదుచేయగా కదిరి రైల్వేపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించగా ఎర్రావారిపాళెం మండలం, ఓఎస్ గొల్లపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ కుమారుడు శివకుమార్ (26) గా గుర్తించారు. మృతుడు శివకుమార్ ఎంబీఎ చదివి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు. ఇతనితోపాటు ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరైందని గుర్తించలేదని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.