క్రైమ్/లీగల్

బామ్మర్ది చిచ్చుతో బావ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, నవంబర్ 9: హాయిగా జీవనం సాగిస్తున్న కుటుంబంలో బామ్మర్ది చిచ్చు పెట్టడంతో బావ బలయ్యాడు. తన చెల్లెకు విడాకులు ఇవ్వాలని వేధించడంతో తీవ్ర ఆందోళనకు గురైన బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దుర్ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చందానగర్‌లోని శాంతినగర్‌లో నివసిస్తున్న జేరిపాటి రాజు(26)కు ఏడేళ్ల క్రితం పాపిరెడ్డి కాలనీకి చెందిన ముద్దంగుల రాములు కూతురు లక్ష్మీ అలియాస్ శిరీషతో వివాహమైంది. వీరికి మగబిడ్డ పుట్టడంతో అందరూ హాయిగా జీవిస్తున్నారు. ఆరు నెలలుగా బామ్మర్ది అయిన ముద్దంగుల వెంకటేష్ ఆ కుటుంబంలో జోక్యం చేసుకుని గొడవలకు కారణమయ్యాడు. తన చెల్లెకు విడాకులు ఇవ్వాలని బెదిరిస్తుండడంతో మానసిక క్షోభకు గురైన రాజు మంగళవారం ఉదయం ఇంటి స్లాబ్ హుక్‌కు చీరతో ఉరేసుకుని చనిపోయాడు. మృతుని తల్లి జేరిపాటి వెంకటమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన చందానగర్ ఇన్‌స్పెక్టర్ బీ.రవీందర్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ రమేష్ దర్యాప్తు చేస్తున్నారు.