క్రైమ్/లీగల్

చోరీ కేసులో ముగ్గురి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), నవంబర్ 19: రాత్రి వేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.1.50 లక్షల విలువైన బంగారం, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపిఎస్‌ఇబి కాలనీకి చెందిన అమ్ముల ఉదయభాస్కర్ (27), సింగ్‌నగర్‌కు చెందిన లూనాసెంటర్‌కు చెందిన దేవనబోయిన రమేష్ (22), గాంధీనగర్ సీతన్నపేటకు చెందిన ఏచూరి సాయిదుర్గాప్రసాద్ (25)లను అరెస్టు చేశారు. నిందితుల్లో అమ్ముల ఉదయభాస్కర్ ఐటిఐ వరకు చదువుకుని ప్రస్తుతం ఖాళీగా ఉంటూ నేరబాట పట్టాడు. ఈక్రమంలో పటమట పోలీస్టేషన్ పరిధిలో అక్టోబర్ 29వ తేదీ రాత్రి ఓ ఇంటి తలుపులు పగులగొట్టి బంగారం, నగదు చోరీ చేశాడు. చోరీ సొత్తును తన స్నేహితులైన రమేష్, సాయి దుర్గాప్రసాద్‌లతో కలిసి పంచుకున్న మీదట బంగారాన్ని ముత్తూట్, మణప్పురం ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టారు. నిందితులను అరెస్టుచేసిన పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేసి రిమాండుకు తరలించారు.