క్రైమ్/లీగల్

చెరువులోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), నవంబర్ 19: విద్యార్థులతో వెళుతున్న ఓ స్కూలు బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెరువులోకి దూసుకుపోయిన ఘటన మండల పరిధిలోని వాడపాలెం గ్రామంలో మంగళవారం సా యంత్రం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ హాని లేకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. చిన్నాపురంలోని కేరళ పబ్లిక్ స్కూలు బస్సు రోజు మాదిరిగా సాయంత్రం విద్యార్థులను ఎక్కించుకుని వాడపాలెం వెళుతుంది. ఎదురుగా వచ్చిన బైక్‌ను తప్పించబోయి రోడ్డు పక్కనున్న చెరువులోకి వెళ్లింది. అయితే ఆ సమయంలో బస్సు నిధానంగా ఉండటం, నిధానంగా ఒక వైపుకు ఒరగటంతో బస్సులో ఉన్న విద్యార్థులను హుటాహుటిన బయటకు తీసుకు వచ్చారు. దీనిపై బందరు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.