క్రైమ్/లీగల్

స్వామి నిత్యానందపై కిడ్నాప్, నిర్బంధం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, నవంబర్ 20: స్వామి నిత్యానంద మళ్లీ వివాదంలో ఇరుక్కొన్నారు. స్వామిపై కిడ్నాప్, అక్రమ నిర్బంధం కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో ఆశ్రమ నిర్వహణ కోసం తన భక్తుల నుంచి విరాళాలు వసూలు చేసేందుకు నలుగురు పిల్లలను అపహరించి వారితో పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలపై నిత్యానందపై కేసు నమోదైంది. అలాగే, స్వామీజీ శిష్యులైన సాధ్వి ప్రణ్‌ప్రియానంద, ప్రియతత్వ రిద్దికిరణ్‌లను ఇదే అభియోగాలపై బుధవారం అహ్మదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పిల్లలను (బాల కార్మికులు) ఒక అపార్టుమెంట్‌లో నిర్బంధించి బలవంతంగా భక్తుల నుంచి విరాళాలు సేకరిస్తున్నట్లు అటు స్వామీజీ, ఇటు శిష్యులు ఇద్దరిపై అభియోగాలు నమోదయ్యాయి. నలుగురు పిల్లల నుంచి వాంగ్మూలం తీసుకొన్న అనంతరం వారిని ‘యోగిని సర్వగ్యపీఠం’ ఆశ్రమం చెర నుంచి విడుదల చేసినట్లు పోలీలు అధికారి పేర్కొన్నారు. అరెస్టయిన స్వామీజీ శిష్యులు ఆశ్రమ నిర్వహణ బాధ్యత వహిస్తున్నారు. ‘వీరిద్దరూ తమను పది రోజులుగా బలవంతంగా నిర్బంధించి హింసించారనీ.. ఆశ్రమ పనులు చేయిస్తున్నారని 9, 10 సంవత్సరాల వయస్సు కలిగిన బాలలు ఇద్దరు వాంగ్మూలంలో తెలియజేశారని’ పోలీసులు వివరించారు. ఇవే అభియోగాలపై మరో ఇద్దరు బాలల్ని వారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆశ్రమం చెర నుంచి విడిపించినట్లు అహ్మదాబాద్ డీఎస్పీ కేటీ కమారియా స్పష్టం చేశారు.
ఐపీసీ సెక్షన్‌లు 365, 344, 323, 504, 502ల కింద వీరిపై కేసులు నమోదు చేశామన్నారు. బాల కార్మిక చట్టం సెక్షన్ 14 కింద కూడా వీరిపై కేసులు పెట్టామన్నారు. ఆశ్రమం చెర నుంచి విడిపించిన ఇద్దరు బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రశ్నిస్తున్నామని కమారియా చెప్పారు. చెర నుంచి విడిపించిన ఇద్దరు బాలికలను కలుసుకోవడానికి తమకు ఆశ్రమ నిర్వాహకులు అభ్యంతరం చెప్పారనీ.. పోలీసులు ఎట్టకేలకు విడిపించి తమకు అప్పగించారని పిల్లల తల్లిదండ్రులు వివరించారు.