క్రైమ్/లీగల్

‘మహా’ మాజీ మంత్రి సురేష్ జైన్‌కు ముంబయి కోర్టు తాత్కాలిక బెయిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: గురుకుల్ గృహా నిర్మాణ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ మంత్రి సురేష్ జైన్‌కు ముంబయి హైకోర్టు బుధవారం తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దీంతో జైన్‌కు ఊరట లభించింది. అనారోగ్య కారణంగా కోర్టు ఆయనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. గురుకుల్ గృహా నిర్మాణంలో జరిగిన రూ.29 కోట్ల అవకతవకల కేసులో జైన్‌కు ఏడేళ్ళ జైలు శిక్ష పడింది. అంతేకాకుండా వంద కోట్ల జరిమానా కూడా విధించింది. అయితే తనకు అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించగా, కోర్టు తాత్కాలిక బెయిల్‌ను ఇచ్చింది. డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్‌వీ మోర్, ఎంఎస్ కర్నిక్ బుధవారం జైన్‌కు మూడు నెలల పాటు బెయిల్ మంజూరు చేశారు. వ్యక్తిగత పూచీకత్తు కింద ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని బెంచ్ ఆదేశించింది. జైన్ తరపు న్యాయవాదులు ఆబాడ్ పాండ, సుభాష్ జాదవ్ బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. 76 ఏళ్ళ జైన్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారని న్యాయవాదులు చెప్పారు.