క్రైమ్/లీగల్

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై విచారణ రేపటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో బస్సురూట్లను ప్రైవేటీకరించడంపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ కొనసాగింది. ఇరుపక్షాల వాదనల అనంతరం తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. రాష్ట్రంలో 5100 రూట్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనపై హైకోర్టులో ప్రజావాజ్యపిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై కొద్ది రోజులుగా వాదనలు కొనసాగుతున్నాయి. పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తమ వాదనలు వినిపించారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో సుప్రీంకోర్టు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు సంబంధించి ఇచ్చిన తీర్పులను న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మూడురోజుల లోపు సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకపోతే 5100 రూట్లను ప్రైవేటీకరిస్తామని ప్రభుత్వం బెదిరింపులకు దిగిందని ఆయన పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున వాదనలు కొనసాగుతున్నపుడు హైకోర్టు అనేక అంశాలను లేవనెత్తింది. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ కొనసాగుతోందని, 1991 తర్వాత సరళీకృత ఆర్ధిక విధానాలు అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయని హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా విమానసర్వీసులను ప్రైవేటీకరించడాన్ని ప్రస్తావించింది. ఆర్టీసీ గుత్త్ధాపత్యానికి సమాంతరంగా ప్రైవేటు రూట్లకు అనుమతి ఇవ్వాలన్న క్యాబినెట్ నిర్ణయం చట్ట వ్యతిరేకమని చట్టంలో ఎక్కడ ఉందో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. రూట్ల ప్రైవేటీకరణకు అనుమతి ఇస్తూ పార్లమెంటు చట్టం చేసిందని, ఈ నేపథ్యంలో మనం ఇంకా 1947 సోషలిస్టు విధానాల్లోనే ఉండిపోవాలంటే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది.
కార్మికులు తమడిమాండ్ల సాధనకు సమ్మె చేస్తున్న సమయంలో ప్రభుత్వం రూట్ల ప్రైవేటీకరణ చేస్తూ నిర్ణయం తీసుకుందని, ప్రైవేటీకరణ వెనుక రహస్య ఒప్పందాలున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. సయోధ్య కోసం ప్రభుత్వం చర్చలకు పిలిపించి, చర్చలు కొనసాగిస్తున్న సమయంలోనే యూనియన్ నేతలు వాకౌట్ చేయడంతో చర్చలు విఫలమయ్యాయని కన్సిలియేషన్ అధికారి తన నివేదికలో పేర్కొన్నారని హైకోర్టు గుర్తుచేసింది.