క్రైమ్/లీగల్

కారు-మోటార్ సైకిల్ ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేవెళ్ల, ఏప్రిల్ 17: కారు మోటర్ సైకిల్ ఎదురు రెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన చేవెళ్ల మండ పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించి గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఆలూర్ గ్రామానికి చెందిన గండయ్య, యాదమ్మల కుమారుడు హనుమంత్(25), అదే గ్రామానికి చెందిన పెంటమ్మ లేట్ లక్ష్మయ్య కుమారుడు మహేశ్వర్ (26) ఇద్దరు పని నిమిత్తం హన్మంత్ బైక్‌పైన చేవెళ్లకు వచ్చి తిరిగి ఆలూర్ గ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యలోని మీర్జాగూడ గేట్ సమీపంలోకి రాగానే కారు ఢీకొనడంతో మోటార్ సైకిల్ పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. చేతికి వచ్చిన కుమారులు చనిపోవడంతో ఆ రెండు కుటుంబాల రోదనలు ఆకాశాన్ని అంటాయి. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.