క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలపై విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గతంలో సింగిల్‌బెంచ్ న్యాయమూర్తులు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలుచేసిన రివిజన్ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం నాడు విచారణ కొనసాగింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లన్నింటినీ కొట్టి వేసింది. అయితే అంతకంటే ముందే సింగిల్ బెంచ్ న్యాయమూర్తులు పలు మున్సిపాల్టీల ఎన్నికలపై స్టే విధించారు. దాదాపు సగం వరకూ మున్సిపాల్టీలపై స్టే కొనసాగుతోంది. ఇరువురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, సింగిల్ బెంచ్ న్యాయమూర్తులు ఇచ్చిన స్టే ఉత్తర్వులు అడ్డంకి కావడంతో వాటిని రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రప్రభుత్వం రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై బుధవారం నాడు విచారణ కొనసాగింది. ప్రభుత్వం హైకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లోపాలను సరిదిద్దిందని అదనపు అడ్వకేట్ జనరల్ వివరించారు. వార్డుల విభజన నేటికీ సక్రమంగా జరగలేదని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. లోపాలు సరిదిద్దినట్టు తమకు ఎలాంటి సమాచారాన్ని ప్రభుత్వం ఇంత వరకూ ఇవ్వలేదని న్యాయవాదులు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను గురువారం నాటికి వాయిదా వేసింది.
గ్రూప్-2 ఎంపిక జాబితాపై హైకోర్టు స్టే
తెలంగాణలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన గ్రూప్-2 ఎంపిక ప్రక్రియకు మరో అడ్డంకి ఎదురైంది. గ్రూప్-2 ప్రాధమిక ఎంపిక జాబితాపై కొంత మంది అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించి, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఉల్లంఘించిందని పేర్కొన్నారు. దాంతో ప్రాధమిక ఎంపిక జాబితాపై హైకోర్టు బుధవారం నాడు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకూ నియామకాలు చేపట్టరాదని హైకోర్టు పేర్కొంది. అక్టోబర్ 24న టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 జాబితాను విడుదల చేసింది. గ్రూప్-2 పరీక్షల్లో వైట్నర్, ట్యాంపరింగ్, స్క్రాచింగ్ చేసిన అభ్యర్ధులను ఎంపిక చేయవద్దని గతంలో కొంత మంది హైకోర్టును ఆశ్రయించారు. అయితే వైట్నర్ చేసిన ఒఎంఆర్‌లను గుర్తించి మిగిలిన వారికి మెరిట్ ప్రాతిపదికపై ఇంటర్వ్యూలను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అభ్యర్ధులను 1:2 నిష్పత్తిలో ఇంటర్వ్యూలను నిర్వహించాలని కూడా పేర్కొంది. అయితే హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోకుండా పబ్లిక్ సర్వీసు కమిషన్ వైట్నర్ అభ్యర్ధులను సైతం ప్రాధమిక ఎంపిక జాబితాలో చేర్చిందని ఎంపిక కాని అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు.