క్రైమ్/లీగల్

మహిళ దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, నవంబర్ 20: నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో మహిళను దారుణంగా హత్యచేసి గోనె సంచికి మూటకట్టి కాలువలో పడేశారు. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని పడుగుపాడు వద్ద సుమారు 35 సంవత్సరాల వయస్సు గల ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమెను హత్యచేసిన దుండగులు మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కి కాలువలో పడేశారు. బుధవారం ఉదయం జమ్మిపాలెం రోడ్డువద్దనున్న సదరన్ కాలువలో ఉన్న ఓ గోనెసంచి నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గోనెసంచిని బయటకు తీసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కోవూరు సీఐ మాట్లాడుతూ మృతురాలి వివరాలు సేకరించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు.