క్రైమ్/లీగల్

నియమించిన అరగంటకే ఎస్సీ,ఎస్టీ జడ్జి సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: మహబూబ్‌నగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కె.రంగారావును సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉదయమే ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక న్యాయ స్థానం జడ్జిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అరగంటకే హైకోర్టు నుండి ఈ ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు ఫ్యాక్స్ ద్వారా మహబూబ్‌నగర్ కోర్టుకు సమాచారం అందిం ది. దీంతో రంగారావు విధుల నుండి తప్పుకున్నారు. మహబూబ్‌నగర్ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన 20 నిమిషాల వ్యవధిలోనే రంగారావు సస్పెన్షన్ ఉత్తర్వులు అందడం న్యాయశాఖలో చర్చనీయాంశం అయింది. ఆయన వికారాబాద్‌లో జిల్లా అదనపున్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో వివిధ కేసులకు సంబంధించి సందేహస్పద తీర్పులు ఇచ్చేవారని వికారాబాద్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. అదనపు న్యాయమూర్తిగా ఉన్న రంగారావు అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంటూ బార్‌కు చెందిన 36 మంది న్యాయవాదులు సంతకాలతో కూడిన ఫిర్యాదును
ఈ నెల 13న హైకోర్టుకు అందజేశారు. దీనిపై సీనియర్ న్యాయమూర్తులు విచారించిన అనంతరమే ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లోని ఎన్‌ఐఎ న్యాయస్థానం నాలుగో కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్‌రెడ్డి తన పదవికి చేసిన రాజీనామాను రాష్ట్ర హైకోర్టు తిరస్కరించింది. రాజీమానా ఆమోదించే వరకూ తనకు సెలవు మంజూరు చేయాలన్న విజ్ఞప్తిని కూడా హైకోర్టు తిరస్కరించినట్టు సమాచారం. దాంతో ఆయన గురువారం నాడు విధులకు హాజరయ్యారని తెలిసింది. మక్కా మసీదు పేలుడు కేసు తీర్పును ఆయన గత సోమవారం మధ్యాహ్నం ప్రకటించగా, సాయంత్రం తన పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. 2007 మే 18న హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల ఉదంతంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఐదుగురు నిందితులను ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అయితే తీర్పు వెలువడిన తర్వాత రవీందర్‌రెడ్డి రాజీనామా చేయడంపై తీవ్రమైన చర్చ మొదలైంది. తీర్పునకు సంబంధించిన అంశాలు కానీ, విచారణ ప్రక్రియకు సంబంధించిన అంశాలు కానీ ఏమైనా ఆయనపై ప్రభావం చూపాయా అని న్యాయవర్గాల్లో విస్తృతమైన చర్చ జరిగింది.