క్రైమ్/లీగల్

బాలికపై లైంగిక దాడి కేసులో ముద్దాయికి 20 ఏళ్ల జైలుశిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం) : బాలికపై లైంగిక దాడి కేసులో నిందితునిపై నేరం రుజువు కావడంతో 20ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు సోమవారం సంచలన తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న దిశ అత్యాచార, హత్య ఘటన నేపథ్యంలో వెలువడిన ఈ తీర్పు చర్చనీయాంశమైంది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. ఉయ్యూరు సుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సైకం కృష్ణారావు(50) 2018 జనవరి 27న ఉదయం పదిన్నర గంటల సమయంలో ఇంట్లో బాలిక ఒంటరిగా ఉండటం చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఇబ్రహీంపట్నం పోలీసులు నిందితుడిని 2018 ఫిబ్రవరి 2న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున పోలీసులు ప్రవేశపెట్టిన 19మంది సాక్షులను విచారించారు. నిందితునిపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి కఠిన శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.