క్రైమ్/లీగల్

అమెరికా వీసాల కోసం నకిలీ డాక్యుమెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: అమెరికా వీసాలు పొందేందుకు నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తున్న ఇద్దరిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శాలిబండకు చెందిన మహ్మద్ ఫర్‌ఖాన్, యాకుత్‌పురాకు చెందిన షేక్ అబ్దుల్ బరిలను అరెస్టు చేసి వారి నుంచి నకిలీ ఆహ్వాన పత్రాలు, డెల్ కంపెనీ పేరుతో ఉన్న ఐడి కార్డులను, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఫర్‌ఖాన్ బాడీ బిల్డింగ్ పోటీలకు నాలుగైదు సార్లు అమెరిగా వెళ్లివచ్చాడు. ఆ ప్రకారం విసా ప్రోసెసింగ్‌లో ఉన్న అనుభవాన్ని డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. అతని స్నేహితుడు అబ్దుల్ బరి నిరుద్యోగిగా ఉండడం, అతనికి కూడా విసా ప్రోసెసింగ్‌లో అనుభవం ఉండడంతో నకిలీ పత్రాలు తయారు చేసేందుకు నిర్ణయించారు. ఒకరికి అమెరికా వెళ్లేందుకు ఆహ్వానం రాగా, వీసాకు దరఖాస్తు చేసుకుని డాక్యుమెంట్లతో హాజరు కావాల్సి ఉంది. ఇందుకు నిందితులు అతనికి టచ్‌లోకి వచ్చి నకిలీవి తయారు చేసి ఇచ్చారు. ఆ పత్రాలతో విసా ఇంటర్వూకి వెళ్లగా యుఎస్ కాన్సులేట్ అధికారులు గుర్తించి తిరస్కరించారు. ఈ సంగతి టాస్క్ఫోర్స్‌కు చేరడంతో నిందితులను అరెస్టు చేశారు.