క్రైమ్/లీగల్

పోలీసు బెటాలియన్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న పోలీస్ బెటాలియన్‌లో ఐదుగురు జవాన్లను కాల్చి చంపిన ఒక జవాన్ తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కడేనార్‌లో ఉన్న ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ల మధ్య బుధవారం వివాదం చెలరేగింది. ఈ వివాదంలో రహ్మన్‌ఖాన్ అనే జవాన్ తన సహచర జవాన్లు ఐదుగురిని కాల్చడంతో వారు అక్కడిక్కడే మరణించారు. ఘటన అనంతరం రహ్మన్‌ఖాన్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కేంద్ర పోలీస్ బలగాలలో సంచలనం కలిగించింది. ఈ సంఘటనలో గాయపడిన మరో ఇద్దరు జవాన్‌లను రాయపూర్ ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా తనకు సెలవు ఇవ్వటం లేదనే ఆక్రోశంతోనే రహ్మన్ ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రచారం జరుగుతున్నది. మొత్తం ఆరుగురు జవాన్లు ఈ ఘటనలో మృతి చెందినట్లు నారాయణపూర్ ఎస్పీ మోహిత్‌గార్గ్ దృవీకరించారు. నారాయణపూర్ జిల్లా కేంద్రానికి కడేనార్ 60కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కేవలం జవాన్ల మధ్య ఏర్పడిన స్వల్ప వివాదమే ఈ ఘటనకు కారణమని సమాచారం. సంచలనం కలిగించిన ఈ ఘటనతో కేంద్ర పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యా రు. 2012లో ఉన్నతాధికారుల వ్యవహరశైలి వల్ల రాజీవ్‌శర్మ అనే ఐపీఎస్ అధికారి బిలాస్‌పూర్ ఎస్పీగా పనిచేస్తూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు రెహ్మన్‌ఖాన్ తనకు సెలవు ఇవ్వటం లేదని ఆరోపిస్తు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరగటం పట్ల విచారణ చేస్తున్నట్లు తెలుస్తొంది.