క్రైమ్/లీగల్

అత్యాచారానికి గురైన బాలిక మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, డిసెంబర్ 4: హర్యానాలోని రోహతక్ జిల్లాలో తండ్రి చేతిలో అత్యాచారానికి గురయిన తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందిందని పోలీసులు బుధవారం తెలిపారు. బాధితురాలి తల్లి కథనం ప్రకారం, ఆమె, కుమార్తెతో కలిసి విడిగా జీవిస్తోంది. నవంబర్ 27వ తేదీన తన భర్త కుమార్తెను తన ఇంటికి తీసికెళ్లి రేప్ చేశాడని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడు తన కుమార్తెను తిరిగి తల్లి ఇంటి వద్ద వదలిపెట్టి వెళ్లిన మరునాడు అంటే ఆదివారం బాధితురాలికి వాంతులు అవడం ప్రారంభమయింది. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారిందని పోలీసులు చెప్పారు. బాధితురాలిని సివిల్ హాస్పిటల్‌కు తీసికెళ్లగా, ఆమె చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిందని రోహతక్ సిటీ పోలీసు స్టేషన్‌లోని ఒక పోలీసు అధికారి ఫోన్‌లో తెలిపారు. బిహార్ స్వస్థలమయిన నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. ఐపీసీలోని సెక్షన్ 302, పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఆయన వివరించారు.