క్రైమ్/లీగల్

ఆటోను ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మానగర్‌లో గల రాజీవ్ రహదారిపై శుక్రవారం జరిగినరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రామకృష్ణ కాలనీకి చెందిన రామిడి నరేష్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితం కొత్త ఆటోను కొనుగోలు చేసి పూజ చేయించుకున్నాడు. మొదటిసారిగా ఆటోను శుక్రవారం రోజున ప్రయాణికులను తరలించే దిశలో మండలంలోని నుస్తులాపూర్ గ్రామం నుండి ఎనిమిది మందిని ఆటోలో ఎక్కించుకొని కరీంనగర్ వైపు వస్తుండగా మార్గమధ్యంలో మహాత్మానగర్‌లోని శ్రీ తాపాల లక్ష్మినర్సింహాస్వామి దేవాలయ సమీపంలో వెనుక నుంచి లారీ అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఆటోడ్రైవర్ నరేష్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ (22), మధు (24) చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే తిమ్మాపూర్‌కు చెందిన మల్లమ్మకు చేయి విరిగింది. రామకృష్ణకాలనీకి చెందిన తూర్పాటి శారద, ఎల్లయ్య, వీణవంక మండలానికి చెందిన నరేంద్ర చారిలకు తీవ్ర గాయాలయ్యాయి.
మృతులలో వెంకటేష్ అనే వ్యక్తికి ఇటీవలే వివాహం జరిగింది. మధు అనే వ్యక్తికి మే 2వ తేదీన వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగి మృతి చెందాడు.. ఆటోను ఢీకొట్టిన లారీ మాత్రం కనబడకుండా పోగా స్థానిక పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. రోడ్డు ప్రమాద స్థలానికి కరీంనగర్ అడిషనల్ డీసీపీ సంజీవ్ కుమార్ చేరుకొని సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. దర్యాప్తు వేగవంతంగా చేసి సంఘటనకు గల నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు.
ఆయన వెంట సీఐ కరుణాకర్ రావు, ఎస్‌ఐ నరేష్ రెడ్డిలు ఉన్నారు. రోడ్డు ప్రమాదం సంఘటనను తెలుసుకున్న మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హుటాహుటిన కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అలాగే తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీలకు చెందిన మృతుల కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. మృతుల దహన సంస్కారానికి ఐదు వేల రూపాయల చొప్పున అందజేశారు.
చిత్రం..ప్రమాదానికి గురైన ఆటో