క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు ఢీకొని విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 4: డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్‌కు నిండు ప్రాణం బలైంది. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొనడంతో డిగ్రీ ఫస్టయిర్ చదువుతున్న విద్యార్థి దుర్మణం చెందారు. స్థానికులు ఆగ్రహించి బస్సుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. సంఘటన బుధవారం ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం రామంతాపూర్ గోఖులేనగర్‌లో నివసిస్తున్న బాటి జయరాం కుమారుడు ప్రవీణ్ (19) దిల్‌సుఖ్‌నగర్‌లోని ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నాడు. ప్రస్తుత పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఉదయం ఇంటి నుంచి పల్సర్ బైక్‌పై బయలుదేరాడు. రామంతాపూర్ మ్యాట్రిక్స్ ఆసుపత్రి ముందు నుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఉప్పల్ నుంచి అఫ్జల్‌గంజ్ వైపు వేగంగా వెళ్తున్న ఫలక్‌నామా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. డ్రైవర్ నిర్లక్ష్యం డ్రైవింగ్‌తో జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. డ్రైవర్ తప్పించుకుని రక్షణ కోసం పోలీసు స్టేషన్‌కు రాగా అక్కడే ఉన్న కొందరు ఆగ్రహంతో బస్సుపై దాడి అద్దాలు ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మైబెల్లి తెలిపారు.