క్రైమ్/లీగల్

దిశ నిందితుల కస్టడీకి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 4: దిశ సంఘటన నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ వీడింది. బుధ వారం సాయంత్రం ఏడు రోజుల కస్టడీకి అనుమతిస్తూ కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సోమవారం నుంచి సాగుతున్న ప్రక్రియను పోలీసులు మంగళవారం రాత్రి కూడా గోప్యంగా ఉంచుతున్నారు. దిశ సంఘటనలో నలుగురు నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ షాద్‌నగర్ పోలీసులు షాద్‌నగర్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ శ్యాంప్రసాద్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. కేసును సమగ్ర దర్యాప్తు జరిపేందుకు వీలుగా పోలీస్ కస్టడీకి అనుమతివ్వాలని పోలీసులు కోరారు. ఏడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చినట్లు బుధవారం సాయంత్రం నిర్ణయించినట్లు తెలిసింది. నిందితులను కస్టడీ తీసుకునే విషయం బయట తెలిస్తే శాంతి భధ్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం దృష్ట్యా పోలీసులు సమాచారం బయటకు పొక్కకుండా దృష్టి పెట్టి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చర్లపల్లి మహానది బ్యారక్‌లో ఉన్న నలుగురు నిందితులను పోలీస్ కస్టడీకి గురువారం కస్టడీలోకి తీసుకుంటారని తెలుస్తోంది. కస్టడీలోకి తీసుకుని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తారా.. లేదంటే ఇతర పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్తారా అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. బయట ఎలక్ట్రానికి మీడియాలో గంటకో సమాచారం వస్తుండటంతో ఆగ్రహంతో ఉన్న పోలీసులు అసలు సమాచారాన్ని కూడా బయటకు తెలుపడానికి నిరాకరిస్తున్నారు. కోర్టు సముదాయం ముందు హల్‌చల్‌పై కూడా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.