క్రైమ్/లీగల్

ప్రేమ వివాహం.. పక్షం రోజులకే అనుమానస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, డిసెంబర్ 4: తల్లిదండ్రులను కాదని, తనకు నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహిత పట్టుమని పక్షం రోజుల కూడా గడవక ముందే తనువుచాలించింది. హృదయవిదారక సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. మోతీనగర్‌లో నివాసం ఉండే ప్రసాద్ ఓ పరిశ్రమను నిర్వహిస్తున్నాడు. ఇతని కుమార్తె పూర్ణిమ అన్నపూర్ణ (25)ను ఇంజనీరింగ్ చదివించాడు. టెక్‌మహేంద్ర సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తోంది. తన తండ్రి పరిశ్రమలో కార్తిక్ హెల్పర్‌గా పని చేస్తున్న సమయంలో అన్నపూర్ణకు పరిచయం అయ్యాడు. వీరి పరిచయం ప్రేమగా మారడాన్ని గమనించి కార్తిక్‌ను విధుల నుంచి ప్రసాద్ తొలగించాడు. అన్నపూర్ణతో కార్తిక్ ప్రేమను కొనసాగించారు.
కార్తిక్ నుంచి దూరం చేసేందుకు తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. గత నెల 22న సింహాచలంలో కార్తిక్‌ను అన్నపూర్ణ వివాహం చేసుకుంది. అనంతరం నగరానికి వచ్చి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరు కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించిన తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ ఇచ్చారు. కార్తిక్‌తోనే ఉంటానని ఖరాకండిగా చెప్పి అతనితో వెళ్లిపోయింది. తన కుమార్తె సంతోషంగా ఉంటే చాలంటూ పోలీస్‌స్టేషన్ నుంచి ప్రసాద్, భారతి దంపతులు వెనుతిరిగి వెళ్లారు. వివాహం జరిగి పక్షం రోజులకే అన్నపూర్ణ అత్తావారి ఇంట్లో అనుమానస్పద స్థితిలో ఉరేసుకొని మృతి చెందింది. విషయం తెలుసుకున్న అన్నపూర్ణ తల్లిదండ్రులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. తమ కుమార్తెను కార్తిక్, అతని తల్లిదండ్రులే హత్య చేశారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ జరిపి మృతదేహాన్ని కిందికి దిప్పారు. అనంతరం మృతురాలిని పూర్తిస్థాయిలో పరిశీలించగా అన్నపూర్ణ తలకు గాయం ఉన్నట్టు గుర్తించారు. కాగా మృతదేహానికి సమీపంలో లభించిన డైరీలో మృతురాలు రాసినట్టుగా సూసైట్ నోట్ లభించింది. హత్య చేసి అనంతరం ఎవరైనా ఆమె డైరీలో నోట్ రాశారా లేదంటే అన్నపూర్ణ స్వహస్తాలతో రాసిందా అనే విషయాన్ని తేల్చేందుకు డైరీని ఫోరెన్సిక్ విచారణకు పంపించారు.