క్రైమ్/లీగల్

బయోడైవర్సిటీ కారు ప్రమాదం కేసులో నిందితుడిని అరెస్టు చేయవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 10: గచ్చిబౌలి బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌పై జరిగిన కారుప్రమాదం కేసులో నిందితుడ్ని తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు పేర్కొంది. ఫ్లైఓవర్‌పై ప్రమాదానికి కృష్ణమిలన్‌రావు కారణమని రాయదుర్గం పోలీసులు హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రమాద సమయంలో 104 కిలోమీటర్లకు పైగా వేగంతో ఆయన వెళ్తున్నారని పోలీసులు తమ కౌంటర్‌లవో పేర్కొన్నారు. ఓవర్‌స్పీడ్ డ్రైవింగ్ కారణంగా ఒకరి మృతికి కృష్ణమిలన్‌రావు కారణమయ్యారని పోలీసులు వివరించారు. కృష్ణమిలన్‌రావు అరెస్టుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే ఫ్లైఓవర్ డిజైన్‌లో లోపమే ప్రమాదానికి కారణమైందని కృష్ణమిలన్‌రావు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 12వ తేదీ వరకూ కృష్ణమిలన్‌రావును అరెస్టు చేయవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్‌పై 12న విచారణ జరుపుతామని పేర్కొంది.