క్రైమ్/లీగల్

నిర్మల్ కోర్టుకు హాజరైన ఎమ్మెల్యే అక్బరుద్ద్దీన్ ఓవైసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 10: రెండు వర్గాల మధ్య 2012 డిసెంబర్ 24న నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు భైంసాలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేసిన ఎంఐ ఎం శాసన సభా పక్షనేత, ఎమ్మెల్యే అక్బరుద్ద్దీన్ ఓవైసీ మంగళవారం నిర్మల్ కోర్టులో విచారణకు హజరయ్యారు. గతంలో నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో 121 ఏ, 153 ఏ, 290 ఏ, 505, 188 ఐపీసీ సెక్షన్‌ల కింద ఆయనపై సుమోటో కేసులు నమోదై ఉన్నాయి. గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జైలులో 60 రోజుల పాటు జైలుశిక్షను అనుభవించారు. కాగా ప్రస్తుతం నిర్మల్ జిల్లా కోర్టులో ఇన్‌చార్జి జూనియర్ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ రామలింగం ఎదుట హాజరై తన న్యాయవాదితో వాదనలు వినిపించారు. అనారోగ్య కారణాల వల్ల హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు కేసును బదలాయించాలని అర్జీని దాఖలు చేశారు. ఈ మేరకు కేసును బదలాయించినట్టు సమాచారం. కాగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.