క్రైమ్/లీగల్

దుర్గగుడి నకిలీ వెబ్‌సైట్ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 10: దుర్గగుడి దేవస్థానం నకిలీ వెబ్‌సైట్ కలకలం రేపుతోంది. దేవస్థానం ఆర్జిత సేవలు, దర్శనం, గదుల కేటాయిస్తామంటూ నకిలీ వెబ్‌సైట్‌లతో మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రచారంలోకి రావడంతో భక్తులు కలవరపాటుకు గురవుతున్నారు. సాక్షాత్తు అమ్మవారి పేరుమీద జరుగుతున్న ఈ వ్యవహారంపై దుర్గగుడి అధికారులు స్పందించారు. విషయం వెలుగులోకి రావడంతో వెబ్‌సైట్‌పై నిఘా ఉంచారు. నకిలీ వెబ్‌సైట్ స్కాంను వెలికి తీసేందుకు ఇటు దుర్గగుడి అధికారులు విచారణ చేస్తూనే.. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దుర్గగుడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎంవీ సురేష్‌బాబు.. నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ క్రైం విభాగం రంగంలోకి దిగి దుర్గగుడి నకిలీ వెబ్‌సైట్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది. దుర్గగుడి అధికారుల అనుమతి లేకుండానే అమ్మవారి సేవలతో కూడిన నకిలీ వెబ్‌సైట్లు హల్‌చల్ చేస్తున్నాయి. మూడు సంస్ధలు ఈ వెబ్‌సైట్లను ఇంటర్నెట్‌లో ఉంచినట్లు ఇప్పటికే సైబర్ విభాగం గుర్తించింది. దుర్గగుడితోపాటు నెమలి వేణుగోపాలస్వామి, చిన్న తిరుపతి, అన్నవరం ఆలయాల సేవలు కూడా ఈ వెబ్‌సైట్లలో ఉన్నట్లు దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. కాగా మంగళవారం కమిషనరేట్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసు కమిషనర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు దుర్గగుడి ఈఓ ద్వారా తనకు ఫిర్యాదు అందినట్లు వెల్లడించారు. నకిలీ వెబ్‌సైట్ల పేర్లతో ఆర్జిత సేవా టికెట్లు అమ్మకాలు చేపడుతున్నారని, వివిధ వెబ్‌సైట్లు ఉన్నట్లు దుర్గగుడి అధికారులు గుర్తించినట్లు తెలిపారు. భక్తులను మోసం చేస్తున్నారా.. లేక దుర్గగుడిని మోసం చేస్తున్నారా అనేది విచారిస్తున్నామని, ఇందుకు సంబంధించి నైపుణ్యం కలిగిన సైబర్ క్రైం విభాగం నిపుణులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ వెల్లడించారు.