క్రైమ్/లీగల్

కమాండింగ్ అధికారి సహా ఇద్దరి హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, డిసెంబర్ 10: ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న జార్ఖండ్‌లో ఒక సీఆర్‌పీఎఫ్ జవాను మద్యం సేవించి తన క్యాంపులోని ఒక అధికారి సహా ఇద్దరు సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో మరొకతడు గాయపడ్డాడు. అధికారులు మంగళవారం ఈ విషయం వెల్లడించారు. కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఇలా సహచరులను హతమార్చిన ఘటన జరగడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోది. బొకారోలోని సీఆర్‌పీఎఫ్ 226వ బెటాలియన్‌లోని ‘చార్లీ’ కంపెనీలో సోమవారం రాత్రి సుమారు 9.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుందని వారు వివరించారు. జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల విధుల్లో భాగంగా ఈ సీఆర్‌పీఎఫ్ యూనిట్‌ను ఇక్కడ మోహరించారు. రాష్ట్రంలో రెండు దశల పోలింగ్ పూర్తయింది. మరో మూడు దశల పోలింగ్ జరగాల్సి ఉంది. కాల్పుల సంఘటనకు కారణమేంటనేది ఇంకా తెలియరాలేదని ఒక సీనియర్ సీఆర్‌పీఎఫ్ అధికారి తెలిపారు. కానిస్టేబుల్ దీపేందర్ యాదవ్ కాల్పులు జరపడానికి ముందే మద్యం సేవించి ఉన్నాడని ఇతర అధికారులు చెప్పారు. కాల్పుల్లో మృతి చెందిన వారిని అసిస్టెంట్ కమాండెంట్ షాహుల్ హర్షన్ బి (28), అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పూర్ణానంద్ భుయాన్ (47)గా గుర్తించారు. గాయపడిన ఇద్దరిలో కానిస్టేబుల్ యాదవ్ ఉన్నాడు. గాయపడిన వారిని రాష్ట్ర రాజధాని రాంచీకి తరలించారు. సీనియర్ సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసు అధికారులు కాల్పులు జరిగిన క్యాంపు వద్దకు చేరుకున్నారు. ఈ కాల్పుల ఘటనపై కోర్ట్ ఆఫ్ ఇంక్వైరీ (సీఓఐ)కి ఆదేశించారు.
ఇండోటిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ)కి చెందిన ఒక సైనికుడు చత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో డిసెంబర్ నాలుగో తేదీన తన సహచరులపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో అయిదుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. తరువాత అతడు తనను తాను కాల్చుకొని మృతి చెందాడు. ఆ సైనికుడికి తాను హతమార్చిన అయిదుగురితో ఒక ‘వివాదం’ ఉండిందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.