క్రైమ్/లీగల్

ఎన్‌కౌంటర్‌పై సుప్రీం మాజీ న్యాయమూర్తితో దర్యాప్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి చేత దర్యాప్తు జరిపిస్తామని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే నాయకత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రకటించింది. తెలంగాణ పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు దిశ హంతకులు హతమైన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీం కోర్టులో రెండు ప్రజా ప్రయోజన వాజ్యాలు (పిల్) దాఖలయ్యాయి. ఇద్దరు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్, శర్మ ఈ రెండు పిల్స్‌ను దాఖలు చేసిన విషయం విదితమే. పిల్ చేసిన న్యాయవాదుల విజప్తి మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే బుధవారం వాటిని పరిశీలించారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ద్వారా తెలంగాణ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపించాలనుకుంటున్నామని బాబ్డే తెలిపారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి పీవీ రెడ్డి ద్వారా దర్యాప్తు జరిపించాలనుకున్నామని, అయితే ఆయన వద్ద
సమయం లేదని బాబ్డే తెలిపారు. తెలంగాణ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు ఎవరిని నియమించాలనేది సూచించాలని ఆయన కక్షిదారులను కోరారు. రెండు ప్రజాప్రయోజన వాజ్యాలను విచారణకు చేపట్టే అంశాన్ని తర్వాత పరిశీలిస్తామంటూ ప్రధాన న్యాయమూర్తి బాబ్డే కేసును గురువారానికి వాయిదా వేశారు. ఉన్నత పదవుల్లో ఉన్న పోలీసు అధికారులు ఎన్‌కౌంటర్ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉన్నందున వీలున్నంత త్వరగా విచారణ జరిపి అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేసిన ఇద్దరు న్యాయవాదులు మణి, యాదవ్ కోర్టును కోరారు.