క్రైమ్/లీగల్

దిశ కేసులో నిందితుల మృతదేహాల అప్పగింతపై సుప్రీంను సంప్రదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: దిశ కేసులో నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే అంశంపై సుప్రీంకోర్టును సంప్రదించాలని అడ్వకేట్ జనరల్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఆదేశించింది. దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై విచారణ జరగాలని, బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు గురువారం ఉదయం విచారణ ప్రారంభించింది. అయితే అదే సమయంలో సుప్రీంకోర్టులోనూ దిశ ఎన్‌కౌంటర్‌పై విచారణ మొదలు కావడంతో హైకోర్టు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం మరోమారు విచారణ ప్రారంభించిన హైకోర్టు మృతదేహాలను శుక్రవారం వరకూ గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని ఆదేశించింది. దిశ కేసుకు సంబంధించి ఇంకే రకమైన విచారణ చేపట్టవద్దని సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది.