క్రైమ్/లీగల్

ఆయేషా మీరా హత్య కేసు పునర్విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 20: విజయవాడకు చెందిన బి-్ఫర్మసీ విద్యార్థిని ఆయేషా మీరాహత్య కేసును పునర్విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థ తీరు పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ ఆయేషామీరా తల్లితండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. హత్య జరిగిన రోజు రాత్రి హాస్టల్‌లో ఉన్న విద్యార్థులను సిట్ సంస్థ విచారణ జరపకుండా, వారి వాంగ్మూలాన్ని ఎందుకు నమోదు చేయలేదని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ నేరం గురించి తమకు తెలియదని విద్యార్థులు చెప్పిన వైనంపై కారణాలను తెలుసుకోవాలని హైకోర్టు దర్యాప్తు సంస్థను కోరింది. ఈ కేసులో నేరానికి పాల్పడిన వారిని పట్టుకోని పక్షంలో దర్యాప్తు సంస్థలంటే ప్రజలకు నమ్మకం పోతుందన్నారు.
మూడు నెలల దర్యాప్తులో సిట్ చేసిన పరిశోధన చాలా తక్కువని కోర్టు పేర్కొంది. సిట్ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. 30 మందిని సిట్ విచారించిందన్నారు. ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం రూ. 61 లక్షల నిధులు విడుదల చేసిందన్నారు. ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉందని న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో సిట్ ఇనెస్పెక్టర్‌గా అబ్దుల్ కరీంను నియమించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను హైకోర్టు అంగీకరించింది. జూలై 13వ తేదీలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని హైకోర్టు సిట్‌ను ఆదేశించింది.