క్రైమ్/లీగల్

ఉన్నావో ఘటనపై నేడు ఢిల్లీ హైకోర్టు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉన్నావో ప్రాంతంలో ఓ మహిళ అపహరణ, అత్యాచారం ఘటనపై డిల్లీ హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించనున్నది. ఈ ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్‌పై ఆరోపణలు రావడంతో ఆ పార్టీ అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పుతో కులదీప్ సింగ్ సెంగార్ భవితవ్యం తేలిపోనుంది. ఉన్నావో ఘటనపై జిల్లా న్యాయమూర్తి ధర్మేశ్ శర్మ తన ఛాంబర్‌లోనే (ఇన్ కెమెరా) విచారణ ముగించారు. విచారణ పూర్తయ్యిందని సోమవారం తీర్పు వెలువరించేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు లక్నో కోర్టు నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. సీబీఐ కూడా ఈ కేసుకు సంబంధించిన సాక్షాధారాలతో వాదన వినిపించింది. దీంతో ఆగస్టు 5 నుంచి కేసును ప్రతి రోజూ విచారణకు చేపట్టారు. 2017 సంవత్సరంలో బీజేపీ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ సెంగార్ ఆ మహిళను అపహరించి, ఆ తర్వాత అత్యాచారానికి పాల్పడినట్లు విమర్శలు వచ్చాయి. ఆమె అపహరణకు గురైనప్పుడు మైనర్ బాలికగా ఉంది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బెంగర్‌వౌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సెంగార్ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో సెంగార్‌ను ఈ ఏడాది ఆగస్టులో బీజేపీ నాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. లైంగిక వేధింపుల నుంచి చిన్న పిల్లల సంరక్షణకు సంబంధించిన (పొక్సొ) చట్టం ప్రకారం సస్పెండైన ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. తొలుత స్థానిక కోర్టు ఎమ్మెల్యేపై హత్య కేసును నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఉన్నావో ఘటనపై తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.