క్రైమ్/లీగల్

కారు బీభత్సం.. మెడికోకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 15: ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక మాజీ మంత్రి తనయుడు అర్థరాత్రి దాటిన తర్వాత బీచ్‌రోడ్డులో అతివేగంగా కారును నడిపి మోటారుబైక్‌ను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో మెడికల్ విద్యార్థికి తీవ్రగాయాలు కాగా, మరొకరు స్పల్పగాయాలతో బయట పడ్డారు. విశాఖ జిల్లా పరవాడ తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు బండారు అప్పలనాయుడు, స్నేహితునితో కలిసి శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటి గంట సమయంలో తన ఇన్నోవా కారులో బీచ్‌రోడ్డులో విశ్వప్రియ ఫంక్షన్ హాలు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో ఆంధ్ర మెడికల్ కళాశాలలో మెడిసన్ మొదటి సంవత్సరం చదువుతున్న చంద్రకిరణ్, స్నేహితుడు గౌతమ్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ తరుణంలో అప్పలనాయుడు కారును వేగంగా నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో చంద్రకిరణ్ కింద పడి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు గమనించి వెంటనే అతన్ని 108అంబులెన్స్ ద్వారా కెజిహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం చంద్రకిరణ్ చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు. వేగంగా నడిపిన కారు పక్కనున్న భవనం వైపు దూసుకెళ్లగా కారు ముందు భాగం దెబ్బతింది. కారు నెంబర్ ప్లేటు ఊడిపోయి, వెనక గ్లాసు పూర్తిగా పగిలిపోవడం గమనార్హం. సంఘటన జరిగిన వెంటనే ప్రమాదానికి కారణమైన అప్పలనాయుడు, స్నేహితునితో కలిసి పారిపోయినట్టు స్థానికులు తెలిపారు. ఈమేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన కారును పరిశీలించారు. ప్రమాదంలో చంద్రకిరణ్ స్నేహితుడు గౌతమ్ స్వల్పగాయాలతో బయటపడినట్టు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన అప్పలనాయుడుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు ఎస్సై హరీష్ తెలిపారు. సిఐ కోరాడ రామారావు నేతృత్వంలో మూడో పట్టణ ఎస్సై హరీష్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.