క్రైమ్/లీగల్

యూపీలో మరో ఘాతుకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, ఏప్రిల్ 20: మైనర్లపై సామూహిక అత్యాచారాల ఘటనలకు నిరసనగా దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నా ఆకృత్యాలు ఆగడం లేదు. వివాహవేడుకకు వచ్చిన తొమ్మిదేళ్ల బాలికపై జరిగిన హత్యాచారం యూపీలో కలకలం రేపింది. ఉన్నావ్, కథువ ఘటనలు మరిచపోకముందే బీజేపీ పాలిత యూపీలోని అలీగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని కెల్తాలో మైనర్ రేప్‌కు గురైంది. బాలికపై అత్యాచారం చేసిన కామాంధుడు ఆమెను చంపేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు అలీగంజ్ సీఐ అజయ్ భాదురియా వెల్లడించారు. పెళ్లికి వంట సామాన్లు సరఫరాచేసే వ్యక్తుల్లో పింటూ (22) అనేవాడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నిందితుడు ఇద్దరి బిడ్డలకు తండ్రి అని సీఐ తెలిపారు. గురువారం రాత్రి ఎటావ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వివాహావేడుకకు హాజరైన బాలిక డాబాపై ఉండగా పింటూ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరువాత దారుణంగా చంపేశాడు. రాత్రంతా బాలిక కోసం గాలించినా జాడ తెలియలేదు. తెల్లవారు జామున నిర్మాణంలో ఉన్న భవనం వద్ద బాలిక మృతదేహం కనుగొన్నారు. బాలిక మెడకు తాడు బిగించి హత్యచేశాడని అడిషనల్ ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఇలా ఉండగా అలీగంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఈనెల 16న ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఓ వివాహానికి హాజరైన ఏడేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి చంపేశాడు. మండీ సమితి గేట్ వద్ద ఈ సంఘటన జరిగింది. పెళ్లిళ్లకు టెంట్‌లు అద్దెకిచ్చే సోనూ జటావ్ (19) ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఓ పక్క అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌సింగ్ సెంగార్ ఓ గ్యాంగ్‌రేప్ కేసులో నిందితుడిగా ఉండటంతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోపక్క పశ్చిమ యూపీలో వరుస అత్యాచార, హత్య ఘటనలు సర్కార్‌ను కలవరపెడుతున్నాయి.