క్రైమ్/లీగల్

ఇద్దరు మావోయిస్ట్ దళ డిప్యూటీ కమాండర్లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, ఏప్రిల్ 20: ఇద్దరు మావోయిస్ట్ దళ డిప్యూటీ కమాండర్లను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్టుచేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఎటపాక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది మావోయిస్టుల కదలికలపై వచ్చిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం 6గంటల సమయంలో భద్రాచలం-చర్లరోడ్డు పిచ్చుకలపాడు టీజంక్షన్ వద్ద వాహనాల తనిఖీచేపట్టారు. ఓ వాహనంలో ఉన్న ఇద్దరు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని ప్రశ్నించారు. వారిద్దరూ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎటపాక పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. విచారణలో వారిద్దరూ ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టు దళంలో డిప్యూటీ కమాండర్లగా పనిచేస్తున్నట్లు తెలిసిందని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట మండలం తమ్మలబట్టి గ్రామానికి చెందిన కట్టమన ఆదాం అలియాస్ సాల్మన్(25), తొండమరాక గ్రామానికి చెందిన కొవ్వాసి కోస (35) అనే వారు మావోయిస్ట్ దళంలో డిప్యూటీ కమాండర్‌స్థాయి కేడర్‌లో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆదాం 2007 నుంచి ఈవోఎఫ్, గొల్లపల్లి ఎల్‌వోఎస్, కిష్టారం ఎల్‌వోఎస్ దళాల డిప్యూటీ కమాండర్‌గా పనిచేశాడని ఇతనిపై రెండు లక్షల రివార్డు ఉందన్నారు. ఇతను ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌ను వినియోగించేవాడని చెప్పారు. అదే విధంగా కొవ్వాసి కోస 2004 నుంచి 2018వ సంవత్సరం వరకు ఈవోఎఫ్, కిష్టారం ఎల్‌వోఎస్ దళ డిప్యూటీ కమండర్‌గా పనిచేశాడని, ఇతనిపై రెండు లక్షల రివార్డు ఉందని ఎస్పీ పేర్కొన్నారు. ఇతను 12బోర్ రైఫిల్‌ను వినియోగించేవాడన్నారు. విలేఖరుల సమావేశంలో ఎటపాక ఓఎస్‌డీ అన్భురాజన్, చింతూరు డీఎస్పీ ఓ దిలీప్‌కిరణ్ పాల్గొన్నారు.