క్రైమ్/లీగల్

తిరుపతిలో జంట హత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి జీవితాంతం తోడు, నీడగా ఉంటానని బాస చేసి వివాహమాడిన భార్యను, కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నబిడ్డను హత్య చేసి ఆపై పోలీసులకు లొంగిపోయిన ఒక నేరస్థుడి ఉదంతమిది. ఆర్థిక సమస్యలతోనే తన భార్య, బిడ్డలను హత్య చేసినట్లు పోలీసులకు లొంగిపోయిన నిందితుడు విచారణలో స్పష్టం చేసినట్లు సమాచారం. హైదరాబాద్ హస్తినాపురానికి చెందిన శ్రీనివాస్ తన భార్య సునీత, కుమార్తె మోక్షజ్ఞలక్ష్మితో కలసి ఈనెల 16న తిరుపతికి వచ్చారు. లీలామహల్‌కు సమీపంలో లాడ్జీలో గదిని అద్దెకు తీసుకున్నాడు. మూడురోజులపాటు తిరుపతి పరిసర ప్రాంతాల్లో పుణ్యక్షేత్రాలు సందర్శించుకున్నారు. 18వ తేదీ భార్య, బిడ్డలకు నిద్రమాత్రలు ఇచ్చి హత్య చేసేందుకు విఫలయత్నం చేశాడు. అయితే 19వ తేదీన రాత్రి తలగడతో భార్య, బిడ్డల ముఖంపై నొక్కి హత్య చేశాడు.
వాస్తవానికి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలని భావించాడో ఏమో గానీ, చివరి నిమిషంలో మనస్సు మార్చుకుని అలిపిరి పోలీసులకు లొంగిపోయాడు. ఈ క్రమంలో ఎస్‌ఐ జయచంద్ర నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు గదికి వెళ్లి మృతిచెందిన తల్లీ, కుమార్తె మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. నిత్యం గోవింద నామ స్మరణలతో మారుమోగే తిరుపతి పుణ్యక్షేత్రంలో జంట హత్యలు నగరవాసులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.