క్రైమ్/లీగల్

తిరుపతి హోటల్లో స్వీడన్ దేశస్థుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 21: తిరుపతిలోని కెనె్సస్ హోటల్లో బస చేసిన స్వీడన్ దేశానికి చెందిన హెడెలాండ్ రోల్ఫ్ ల్యాంపర్ట్ విల్లే (58) శనివారం మృతి చెంది ఉండడాన్ని హోటల్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాళహస్తి లోని గ్రీన్‌ప్లై సంస్థకు అవసరమైన యంత్రాలను అమర్చడానికి స్వీడన్ దేశం నుంచి 10 మంది బృందం శుక్రవారం తిరుపతికి చేరుకుంది. వీరితోపాటు వచ్చిన విల్లే రాత్రి భోజనం చేసి తన గదిలో బస చేశాడు. ఉదయం అల్పాహరం చేయడానికి ఆయన రాకపోవడంతో ఆయన స్నేహితుడు హ్యాప్టెన్ రెక్స్ నిబిలీ, విల్లే బసచేసిన గదికి వెళ్లి తలుపులు తట్టాడు. అయితే ఎంతకీ తలుపులు తీయక పోవడంతో ఆయన హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో వారు తమ వద్ద ఉన్న మాస్టర్ కీతో డాక్టర్‌ని వెంటబెట్టుకుని గదిలోకి ప్రవేశించారు. అయితే అప్పటికే విల్లే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపాడు. అదే సమయంలో విల్లే మృతికి సంబంధించి ఈస్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. డి ఎస్పీ మునిరామయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఈసందర్భంగా ఈస్ట్ డిఎస్పీ మునిరామయ్య మాట్లాడుతూ విల్లే గత 10 సంవత్సరాలుగా గుండె జబ్బుతో బాధపడుతున్నట్లు ఆయన స్నేహితుల ద్వారా తెలిసిందన్నారు. పోస్టుమార్టం అనంతరం ఆయన మరణానికి కారణాలు తెలుస్తాయన్నారు.