క్రైమ్/లీగల్

మరోసారి వార్తల్లో ఏఎస్పీ సునీతా రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: వివాహేతర సంబంధం కేసులో సస్పెన్షన్‌కు గురైన ఏసీబీ ఏఎస్పీ సునీతారెడ్డి మరోసారి వార్తల్లో కెక్కారు. ఆమెకు పదేళ్ల కిందటే పెళ్లైందన్న ప్రచారం సోషల్ మీడియాకెక్కింది. పెళ్లి ఫోటోలు సైతం చక్కర్లు కొడుతున్నాయ. అయితే అవి సునీతారెడ్డివా? కాదా? అనే అంశంపై స్పష్టత లేదు. ప్రస్తుత భర్త సురేందర్ రెడ్డి కంటే ముందే వివాహం చేసుకుని, తర్వాత అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టినట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో భర్త కూడా షాక్‌కు గురయ్యాడు. ఇటీవలే సిఐ మల్లికార్జున రెడ్డితో వివాహేతర సంబంధం కారణంగా సునీతను, మల్లిఖార్జున రెడ్డిని పోలీసు శాఖ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తులో కొత్త ట్విస్ట్ బయటకు రావడంతో వాస్తవాలను తేల్చే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు.