క్రైమ్/లీగల్

జగన్, అంబటిపై కేసు కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై ఎస్సీ ఎస్టీ అత్యాచార, దౌర్జన్యాల నిరోధక చట్టం కింద హైదరాబాద్ గాంధీనగర్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటస్వామి ఫిర్యాదు చేశారు. తమపైన నమోదైన కేసును కొట్టివేయాల్సిందిగా జగన్, అంబటి రాంబాబు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ పి కేశవరావు విచారించారు. హైకోర్టు ఆదేశం మేరకు పోలీసులు కేసు నమో దు చేశా రు. తమను కులం పేరుతో దూషించారని ఫిర్యాదిదారు పేర్కొన్నారు. రాజకీయ వైరంతోనే కొంత మంది ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతల ప్రోద్బలంతో తన క్లయంట్స్‌పైన ఫిర్యాదు చేశారని జగన్, అంబటి తరఫున న్యాయవాది సి.నాగేశ్వరరావు కోర్టుకు తెలిపారు. అనంతరం కేసు పూర్వాపరాలను విచారించిన హై కోర్టు కేసును కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.